నేరేడుచర్ల, మార్చి 16, డైనమిక్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండలో 4వ తరగతి ప్రవేశాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా విద్యార్థులకు మండల స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఎం. బాలుఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఇప్పటికే http://tgss.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్న బాలబాలికలకు మార్చి 13 నుండి 17 వరకు మండల స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేరేడుచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీ యాదగిరి ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.
9 రకాల మోటార్ క్వాలిటీ పరీక్షలు
మండల స్థాయిలో మొత్తం 9 రకాల మోటార్ క్వాలిటీ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో
ఎత్తు (Height)
బరువు (Weight)
30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్
స్టాండింగ్ బ్రాడ్ జంప్
800 మీటర్ల పరుగుపందెం
6×10 మీటర్ల షటిల్ రన్
మెడిసిన్ బాల్ పుట్
వెర్టికల్ జంప్
ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపిస్తారు.
జిల్లా స్థాయి ఎంపికలు
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు జిల్లా స్థాయిలో మళ్లీ ఇదే 9 పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపిస్తారు.
వయస్సు అర్హత
4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 8 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే 01 సెప్టెంబర్ 2017 నుండి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించినవారై ఉండాలి.
అవసరమైన పత్రాలు
ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది పత్రాలు తీసుకురావాలి.
ప్రస్తుత పాఠశాల నుండి స్టడీ సర్టిఫికేట్
జనన ధృవీకరణ పత్రం
5 పాస్పోర్ట్ సైజు ఫోటోలు
ఆధార్ కార్డు
కుల ధృవీకరణ పత్రం
క్రీడలపై ఆసక్తి ఉన్న నేరేడుచర్ల మండలంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మండల విద్యాధికారి ఎం. బాలు పత్రికా ప్రకటనలో సూచించారు. అలాగే మార్చి 17 ఎంపికలకు చివరి తేదీ కావడంతో అర్హత కలిగిన వారు తప్పకుండా హాజరుకావాలని కోరారు.
