డెస్క్ డైనమిక్, అక్టోబర్ 23
ప్రపంచం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా మారుతున్న నేపథ్యంలో టెక్నాలజీలోతమ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓసత్యనాదెళ్ల (Satya Nadella) పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ రాశారు. అందులోపలు కీలక అంశాలను ప్రస్తావించారు.సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతుందన్నారు. కొత్త తరంఆవిష్కరణల్లో తాము ముందుకు సాగుతున్నామని ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు
తెలిపారు. ఈ సమతుల్యతను సాధించడం కష్టతరమైన పని అని, ఏళ్ల పాటుగా కొన్ని కంపెనీలు మాత్రమే దీన్ని చేయగలిగాయన్నారు. విజయం సాధించాలంటే దశాబ్దాల పాటు ఆలోచిస్తూనేఉండాలన్నారు. భవిష్యత్తుపై దృష్టిసారించాలని, నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకునేలాఉత్సుకతను నింపుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాలను సాధించే క్రమంలో భద్రత, నాణ్యత, ఏఐఆవిష్కరణ వంటివి తమ ప్రాధాన్యమన్నారు. తమ కంపెనీ సేవలు ప్రపంచానికి కీలకమైనవనివ్యాఖ్యానించారు. ఏఐ మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నామన్నారు.అనేక దేశాల్లో కొత్త డేటా సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 70 ప్రాంతాల్లో 400కంటే ఎక్కువ డేటా సెంటర్లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో విస్కాన్సిన్లోప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఏఐ డేటా సెంటర్ను ప్రకటించామన్నారు. మన చుట్టూఉన్న ప్రపంచం బాగుంటే.. మనం కూడా బాగుంటామనే దాన్ని మైక్రోసాఫ్ట్ విశ్వసిస్తోందన్నారు.భూమి మీద ఉన్న ప్రతిఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే సాంకేతికతను సృష్టించాలని నిబద్ధతతో కృషిచేస్తున్నామన్నారు. ప్రజలు విశ్వాసం కలిగిన సాంకేతికతను కోరుకుంటున్నారని వివరించారు.అందుకే బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలను, సురక్షిత సాంకేతికతను నిర్మించేందుకు కట్టుబడిఉన్నామన్నారు. ఇక, ఉద్యోగాలు సృష్టించేందుకు, ఆర్థిక అవకాశాలను ప్రోత్సహించడంతో సహా
ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రత, డిజిటల్ స్థిరత్వం బలోపేతానికి అంకితభావంతో ఉన్నామన్నారు.
