డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 31
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు కీత కనకయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా చైర్‌పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి హాజరై, పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,“దేశ ఐక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి, ధైర్యసాహసాలు, రాజకీయ పటిమ విశేషం. చిన్న చిన్న ప్రిన్స్ స్టేట్స్ భారతదేశంలో విలీనం కావడం ఆయన కృషికే సాధ్యమైంది” అన్నారు. పటేల్ సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి షేక్ యూసుఫ్, కోశాధికారి సరికొప్పుల నాగేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు జిలకర రామస్వామి, మూలగుండ్ల వెంకటరెడ్డి, లాయర్ విశ్వనాథ్, బసవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
