డైనమిక్ ,నసరావుపేట , అక్టోబర్ 23
పల్నాడు జిల్లా నరసరావుపేట లోని సుబ్బరాయ అండ్ నారాయణ (SSN) కాలేజీలో ఫార్మసీ కోర్సుల తరగతుల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయ్‌కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త బత్తుల మురళి పాల్గొన్నారు.కాలేజీ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కాలేజీ కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సందర్భంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పట్టుదలతో చదివి సమాజానికి సేవ చేయాలని ఎమ్మెల్యే అరవింద బాబు విద్యార్థులకు సూచించారు.
