Monday, March 2, 2026
Homeతాజా సమాచారంగులాబీ బాస్‌ వద్ద బీఆర్ఎస్‌ నేతల హడావిడి సమావేశం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కీలక వ్యూహాలు...

గులాబీ బాస్‌ వద్ద బీఆర్ఎస్‌ నేతల హడావిడి సమావేశం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కీలక వ్యూహాలు – కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,డైనమిక్ అక్టోబర్‌ 23

మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)తో బీఆర్ఎస్‌ కీలక నేతలు గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారు. పలు రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేసీఆర్‌ సమక్షంలో కీలక చర్చలు

మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జగదీశ్వర్‌రెడ్డి లతో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ భవిష్యత్‌ వ్యూహం, ప్రచార తీరుతెన్నులు, స్థానిక శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఉప ఎన్నికపై కేసీఆర్‌ స్పష్టమైన మార్గనిర్దేశం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సిట్టింగ్‌ సీటును ఏ విధంగానైనా తిరిగి గెలుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రచారంలో కేటీఆర్‌, హరీశ్‌రావులు బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా విసృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ సమావేశంలో ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, దాసోజు శ్రావణ్‌, రసమయి బాలకిషన్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పునరుత్థానం కోసం సమన్వయ కృషి కొనసాగించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments