మఠంపల్లి, మార్చి 23, డైనమిక్ న్యూస్
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 ఐదవ రాష్ట్ర మహాసభను మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు నేరేడుచర్ల ఆర్టీఐ మండల అధ్యక్షులు నందిపాటి గురవయ్య తెలిపారు.
రాష్ట్ర నలుమూలల నుంచి హాజరు
ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు కార్యకర్తలు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు.
కీలక అంశాలపై చర్చ
ఈ సమావేశంలో సమాచార హక్కు చట్టం అమలు విధానాలు, లోకాయుక్త వ్యవస్థ, మానవ హక్కుల అంశాలపై నిపుణులు వివరణ ఇవ్వనున్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యంగా ఈ మహాసభ నిర్వహించబడుతోంది.

పాల్గొనాలని పిలుపు
నేరేడుచర్ల మండలంలోని ఆర్టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందిపాటి గురవయ్య కోరారు.
