Thursday, January 15, 2026
Homedainamicరోహిత్‌, శ్రేయస్‌ అర్ధశతకాలు — భారత్‌కు 264 పరుగులు

రోహిత్‌, శ్రేయస్‌ అర్ధశతకాలు — భారత్‌కు 264 పరుగులు

డైనమిక్ డెస్క్, అక్టోబర్ 23 , స్పోర్ట్స్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు పోరాటపటిమ చూపించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 265 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 73 పరుగులతో ఆకట్టుకోగా, శ్రేయస్‌ అయ్యర్‌ 61 రన్స్‌తో జట్టుకు స్థిరత్వం ఇచ్చాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (44), హర్షిత్‌ రాణా (24 నాటౌట్‌) విలువైన రన్స్‌ సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి భారత్‌ను నిలువరించగా, గ్జేవియర్‌ మూడు, స్టార్క్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments