సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 21
సూర్యాపేట జిల్లాలో వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ విధానంలో అమలు చేశేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్‌లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
తడి–పొడి విడగొట్టి ఆదాయ మార్గాలు సృష్టించాలి
మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డులు లేదా వ్యర్థాల వేరు చేసే కేంద్రాల్లో శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని కలెక్టర్ సూచించారు.తడి, పొడి, ప్లాస్టిక్, రీసైక్లింగ్ పదార్థాలను విడగొట్టి, మట్టిలో సహజంగా కరుగే వ్యర్థాల ద్వారా కంపోస్ట్ ఎరువులు తయారు చేసి ఆదాయం పొందే విధానాలను అమల్లోకి తేవాలని ఆయన సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాల వేరు చేసే కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.
పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలపై కఠిన చర్యలు
పారిశ్రామిక వ్యర్థాలు, విషపదార్థాలు, కాలుష్య నీరు చెరువులు మరియు కాలువల్లో కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు
వీడియో కాన్ఫరెన్స్‌కు మున్సిపల్ కమిషనర్లు హన్మంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస రెడ్డి, మున్వర్ అలీ, అలాగే ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
