Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంకర్ల రాజేష్ మృతికి కారకులైన ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్ నేరేడుచర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార...

కర్ల రాజేష్ మృతికి కారకులైన ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్ నేరేడుచర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 24

కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారకులైన చిలుకూరు ఎస్సైతో పాటు సంబంధిత పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మొదటి రోజుకు చేరుకున్నాయి.

పూర్తి స్థాయి విచారణ జరపాలి

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ, జిల్లా ఎంఎస్పి ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య మాదిగ, నడిగూడెం మండల ఇన్‌చార్జి ఇంజమూరి మల్లయ్య మాదిగ మాట్లాడుతూ, కర్ల రాజేష్ మృతిపై పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన ఎస్సైతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని వారు కోరారు.

పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నేతల పాల్గొనడం

ఈ నిరాహార దీక్షలో ఎంఎస్పి మండల అధ్యక్షుడు మచ్చ శీను, వడ్లమూడి ఉపేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మిడతపల్లి శ్రీను, వికలాంగుల సంఘం నాయకులు పల్లెపంగు వెంకటయ్య, శ్రీరాములు, వెంకన్న తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments