Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంగ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల స్వీకరణ – ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ నరసింహ సూచనలు

గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల స్వీకరణ – ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ నరసింహ సూచనలు

సూర్యాపేటబ్యూరో, డైనమిక్,నవంబర్10

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే/ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి నరసింహ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశాలు

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి కేసును పారదర్శకంగా విచారించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిరంతరంగా నిర్వహించబడుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతోందన్నారు.

పిర్యాదుల స్థితిపై నిరంతర సమీక్ష

గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును సమీక్షిస్తూ, పరిష్కారం వరకు అనుసరించబడుతోందని తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments