డైనమిక్, ఏ.పి.బ్యూరో,అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె పలు అంశాలపై వారితో చర్చించారు. మహిళా సాధికారత దిశగా కమిషన్ భవిష్యత్ ప్రణాళికను సీఎంకు వివరించారు. అదేవిధంగా మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త చర్యల్లో భాగంగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి వైద్యసాయం అందించడంలో ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధను మహిళా కమిషన్ తరఫున ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. చైర్ పర్సన్ గా పదవిలోకి వచ్చిన అనతికాలంలోనే మహిళా కమిషన్ కు మంచిపేరు తెచ్చిన రాయపాటి శైలజ ను సీఎం చంద్రబాబు అభినందించారు.
