Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దంపతుల తిరుమల తిరుపతి స్వామీ దర్శనం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దంపతుల తిరుమల తిరుపతి స్వామీ దర్శనం

తిరుమల,డైనమిక్ అక్టోబర్ 19

ఆదివారం ఉదయం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు వారి భర్త అనిల్ దంపతులు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటైన వీఐపీ బ్రేక్ సమయంలో కవిత దంపతులను స్వామి వారి దర్శనానికి అర్చకులు తీసుకువెళ్ళారు. అనంతరం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ అధికారులు వారిని సత్కరించారు.

దర్శనానంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ

“తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందుతాము,” అన్నారు.కవిత ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ జాగృతి ‘జనంబాట’ కార్యక్రమానికి స్ఫూర్తి పొందేందుకు ఆలయానికి వచ్చారని, నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు కోరామని తెలిపారు.అమితమైన భక్తితో, తెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్రాలు సుభిక్షత, శాంతి మరియు అభివృద్ధి కోసం దేవుని ఆశీర్వాదాలు కోరిందని ఆమె తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments