వరంగల్,డైనమిక్ ,అక్టోబర్20
వరంగల్ పట్టణంలో పేకాటా కలకలం రేపింది. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబుతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడి
టాస్క్‌ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసి 13 మందిని పట్టుకున్నారు. సంఘటన స్థలంలో నుండి రూ.3.68 లక్షల నగదు, 15 మొబైల్ ఫోన్లు పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.రాజకీయ నేతలు, కార్పొరేటర్లు కూడా పాల్గొనగా పేకాట రాయుళ్లలో పలువురు కార్పొరేటర్లు, స్థానిక రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో వరంగల్ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.కేసు నమోదు, విచారణ కొనసాగుతోంది .అరెస్టయిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పేకాట నిర్వహణకు సంబంధించిన ప్రధాన నిర్వాహకులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
