Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంవిద్యార్థినుల ప్రయాణ సౌకర్యంపై పోచారం శ్రీనివాసరెడ్డి శ్రద్ధ

విద్యార్థినుల ప్రయాణ సౌకర్యంపై పోచారం శ్రీనివాసరెడ్డి శ్రద్ధ

బాన్సువాడ,డైనమిక్, అక్టోబర్ 23

నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని ఎస్‌.ఆర్‌.ఎన్‌.కె కళాశాల నుండి గురుకుల వసతి గృహ విద్యార్థినుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో విద్యార్థినులతో కలిసి గురువారం ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ ఛైర్మన్ కాసుల బాలరాజు.

విద్యార్థినుల సమస్యపై వెంటనే చర్య

ఈ నెల 14వ తేదీన బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్తూ దుర్కి శివారులో రహదారిపై బాన్సువాడ వైపు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులను గమనించిన పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో మాట్లాడి విద్యార్థినుల కోసం ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బస్సు సర్వీసులపై ఆకస్మిక తనిఖీ

ఆదేశాల మేరకు బస్సు సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ఆ బస్సులో ప్రయాణించి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు.

కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినులు

ఎటువంటి ఇబ్బందులు లేకుండా కళాశాలకు చేరుకుంటున్నామని, తమ సమస్యపై వెంటనే స్పందించి సౌకర్యం కల్పించినందుకు పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థినుల ఆనందాన్ని చూసి పోచారం శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

విద్యాభ్యాసం నిరంతరంగా కొనసాగేందుకు కృషి

విద్యార్థినుల విద్యాభ్యాసం అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments