నేరేడుచర్ల, డైనమిక్ ,నవంబర్ 3
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న సందర్భంగా పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) నేరేడుచర్ల విద్యార్థినులు విజయోత్సవం నిర్వహించారు.భారత మహిళా జట్టు సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఉత్కంఠభరిత పోరులో మట్టికరిపించి ప్రపంచ కప్‌ను సాధించడం దేశ గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు పేర్కొన్నారు.ఈ విజయం భారతీయ నారీశక్తికి ప్రతీకగా నిలుస్తుందని, విద్యార్థినులు కూడా క్రీడా రంగంలో రాణించాలనే స్ఫూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు ఎ.అన్నపూర్ణ, ఎం.నాగమణి, ఎస్.డి.హష్రూన్, ఉపాధ్యాయులు ఎం.సైదులు, రషీద్ ఖాన్, జానకిరాములు, వెంకటేశ్వరరావు, ఎన్.వి., జానయ్య, బికోజి, పిడి.యాదగిరి, బాలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు, సరస్వతి పాల్గొన్నారు.

