సూర్యాపేట బ్యూరో,డైనమిక్ ,నవంబర్2
సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, సీసీ రోడ్లు దెబ్బతినడం, వీధి దీపాలు పనిచేయకపోవడం వంటి సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన వేణారెడ్డి మున్సిపల్ కమిషనర్‌కు కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
