డైనమిక్ డెస్క్,అమరావతి, నవంబర్ 6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ (వడ్రంగి) అసోసియేషన్ ప్రతినిధులు గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి సంజూ వరెడ్డి సమిత ను కలుసి కార్పెంటర్ల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, “ఆదరణ-3” పథకంలో ఈసారి కార్పెంటర్లకు కనీసం 90 శాతం సబ్సిడీతో రూ.1.50 లక్షల విలువైన ఆధునిక మిషనరీలు అందించాలి అని మంత్రిని కోరారు.అదేవిధంగా, బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కార్పెంటర్ ఒక చిన్నతరహా పారిశ్రామికవేత్తగా ఎదగేందుకు రూ.20 లక్షల రుణం మంజూరు చేసి, అందులో 50 శాతం సబ్సిడీగా ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల రుణమాఫీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో స్థానిక కార్పెంటర్లకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కూడా వారు మంత్రిని అభ్యర్థించారు
