పాలకవీడు, మార్చి 7 డైనమిక్ న్యూస్
మారుమూల గ్రామాల అభివృద్ధి సాధ్యమవ్వాలంటే భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి కీలకమని పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం
ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌లు గుత్తికొండ భూపాల్ రెడ్డి, మునగాల వరలక్ష్మి రామంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మంత్రి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.18 కోట్లతో డబుల్ రోడ్ మంజూరు
ఈ సందర్భంగా భూక్యా గోపాల్ నాయక్ మాట్లాడుతూ పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం నుంచి ముసి ఒడ్డు సింగారం మీదుగా ఎల్లాపురం గ్రామం వరకు సుమారు రూ.18 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్ మంజూరు కావడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ వల్లేనని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే ప్రాంత ప్రజల రవాణా సమస్యలు తగ్గడంతో పాటు రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ఎంతో సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రాంత అభివృద్ధికి మంత్రి కృషి
ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చేస్తున్న కృషికి ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆయన అన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ జితేందర్ రెడ్డి, సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రామంజన్ రెడ్డి, సాయి రెడ్డి, ఒంటెద్దు సైదిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రావుల కోటయ్య, రమేష్ రెడ్డి, అందే రాజు, శ్రీనివాస్ రెడ్డి, శేషిరెడ్డి, రాజీవ్ రెడ్డి, అంజి, రమేష్ వెంకట్ రెడ్డి, వినయ్, కహీం, అజిత్, అజీమ్, బాబు, జాను తదితరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
