Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంసౌదీకి అద్దెకు పాకిస్థాన్ సైన్యం

సౌదీకి అద్దెకు పాకిస్థాన్ సైన్యం

డైనమిక్ డెస్క్,ఇస్లామాబాద్, అక్టోబర్ 25

రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు 25 వేల మంది సైనికులను అద్దెకు ఇవ్వడానికి అంగీకరించింది.ఇటీవల పాకిస్థాన్ – సౌదీ అరేబియా దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. దాడులు, భద్రతా ముప్పులు ఎదురైనప్పుడు పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ ఒప్పందం వెనుక అసలు ఉద్దేశం సౌదీకి పాకిస్థాన్ సైన్యాన్ని అద్దెకు ఇవ్వడమేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.సమాచారం ప్రకారం, ఈ ఒప్పందం కింద సౌదీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు సుమారు ₹88 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించనుంది. ఆర్థికంగా దివాళా దిశగా వెళ్తున్న పాకిస్థాన్‌కు ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించ నుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రుణాల భారంతో నలుగుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టడానికి ఈ “సైనిక అద్దె విధానం”ను ఎంచుకోవడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments