Thursday, January 15, 2026
Homedainamicకొనసాగుతోన్న బంద్‌… తెలంగాణ స్తంభించినట్టే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బీసీ...

కొనసాగుతోన్న బంద్‌… తెలంగాణ స్తంభించినట్టే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బీసీ సంఘాల సమాఖ్య బంద్‌ పిలుపు – రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి

డైనమిక్ ,హైదరాబాద్‌, అక్టోబర్‌ 18

తెలంగాణ రాష్ట్రం శనివారం ఉదయం నుంచి బీసీ సంఘాల బంద్‌తో స్తంభించినట్టయింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల సమాఖ్య పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

డిపోల వద్ద బస్సుల నిరోధం

తెలంగాణలోని దాదాపు అన్ని ఆర్టీసీ డిపోల వద్ద బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.హైదరాబాద్‌, తెలంగాణా వ్యాప్తంగా అన్ని  ప్రాంతాల్లో బస్సులు బయటకు రాకుండా బంద్ పాటించారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీల నాయకులు  నాయకులు, కార్యకర్తలతో కలిసి బంద్‌లో పాల్గొన్నారు.డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా, పరిస్థితి ప్రశాంతంగానే కొనసాగుతోంది.

42% రిజర్వేషన్ – 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌

బీసీ సంఘాల నాయకులు, ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ,“బీసీలు ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక. కానీ స్థానిక సంస్థల్లో సరైన ప్రతినిధిత్వం లభించడం లేదు.ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేసి, చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి” అని స్పష్టం చేశారు.

అన్ని పార్టీల మద్దతు

ఈ బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, సీపీఐ(ఎం‌ఎల్) వంటి ప్రధాన రాజకీయ పక్షాలు బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి.అదేవిధంగా ఎంఆర్‌పీఎస్‌, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా బంద్‌లో భాగమయ్యాయి.

విద్యా, వ్యాపార రంగాలపై ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, ప్రైవేట్‌ ఆఫీసులు చాలా చోట్ల స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.
బంద్‌ ప్రభావంతో ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.బస్సులు రాకపోవడంతో పౌరులు స్టేషన్‌లు, బస్టాండ్లలో చిక్కుకున్నారు.అయితే అత్యవసర సేవలు (అంబులెన్సులు, ఆసుపత్రులు) మాత్రం మినహాయింపులోకి వస్తున్నాయి

సాయంత్రం 5 వరకు బంద్‌ కొనసాగింపు

బీసీ ఐకాస నేతల ప్రకారం బంద్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.ప్రజలు అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్‌లో మెట్రో, క్యాబ్‌ సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ రోడ్లపై రద్దీ తగ్గింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బంద్‌ పరిస్థితిని సమీక్షిస్తోంది.బీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు .“మా డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే,ఈ ఉద్యమం మరింత విస్తృతంగా సాగుతుంది” .బీసీల హక్కుల కోసం తెలంగాణ అంతా బంద్‌తో ఊగిపోతోంది.ఆర్టీసీ చక్రాలు ఆగిపోయిన ఈ బంద్‌ .రిజర్వేషన్ల అంశంపై తీసుకునే నిర్ణయమేఈ ఉద్యమ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments