బక్కమంతులగూడెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
డైనమిక్,మఠంపల్లి, అక్టోబర్ 25
మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామంలో నాగుల చవితి పండుగను పురస్కరించుకొని ఉత్సవజై కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్థులు


ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగుల చవితి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వల్లపుదాసు శ్రీనివాస్ గౌడ్, వల్లపుదాసు నరసింహ గౌడ్, బొల్లేపపల్లి అంజిగౌడ్, గుణగంటి నరసింహ గౌడ్, గుణగంటి వీరస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
