Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఈ నెల 24న పండుగ వాతావరణంలో మాచర్ల అభివృద్ధికి శ్రీకారంరూ.26 కోట్లతో పలు అభివృద్ధి పనులకు...

ఈ నెల 24న పండుగ వాతావరణంలో మాచర్ల అభివృద్ధికి శ్రీకారంరూ.26 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

డైనమిక్ న్యూస్,మాచర్ల , డిసెంబర్ 22

మాచర్ల నియోజకవర్గంలో ఈ నెల 24న పండుగ వాతావరణంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శాసన సభ్యుల కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ.26.48 కోట్ల నిధులతో సిద్ధమైన పలు నిర్మాణ పనులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం

రెంటచింతల మండల కేంద్రంలో రూ.4.23 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గిరిజన సంక్షేమ పాఠశాల భవన నిర్మాణ పనులకు ఈ నెల 24న శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మాచర్ల పట్టణ పరిధిలోని పీడబ్ల్యూడీ కాలనీలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం పనులకు కూడా భూమిపూజ చేయనున్నారు.

మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పరుగులు

మాచర్ల మున్సిపల్ పరిధిలో రూ.7.45 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల దిశగా ఈ పనులు కీలకంగా నిలవనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

విద్యుత్, రహదారి సౌకర్యాల విస్తరణ

టిడ్కో ఇళ్ల వద్ద రూ.2.80 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పనులకు భూమిపూజ చేయనున్నారు. అలాగే కొత్తపల్లి జంక్షన్ వద్ద రూ.5 కోట్లతో నిర్మించనున్న కొత్తపల్లి–విజయపూరి సౌత్ బీటీ రహదారి పనులకు శంకుస్థాపన జరగనుంది.

వసతి గృహాలు, పారిశుధ్యంపై దృష్టి

మాచర్ల మండలం పరిధిలోని 7వ మైల్ వద్ద గల గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్ల పనులకు కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.

విజయపూరి సౌత్‌లో రోడ్ల ప్రారంభం

విజయపూరి సౌత్‌లో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మాచర్ల అభివృద్ధిలో మరో మైలురాయి

ఈ కార్యక్రమాలతో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడనున్నదని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments