నల్లగొండ బ్యూరో, నవంబర్ 28, డైనమిక్ న్యూస్
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ నేటి నుంచి నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖులు ప్రారంభం
ఈ టోర్నమెంట్‌ను ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గార్లతో పాటు పలువురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న పోటీలు
నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ డిసెంబర్ 20 వరకు కొనసాగుతుందని తెలిపారు.
64 టీముల పాల్గొనం
ఈ పోటీలో మొత్తం 64 జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
