Monday, March 2, 2026
Homeతాజా సమాచారంహుజూర్‌నగర్ కోర్టులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఘనంగా

హుజూర్‌నగర్ కోర్టులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఘనంగా

డైనమిక్ ప్రతినిధి, హుజూర్‌నగర్, నవంబర్ 7:

హుజూర్‌నగర్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి రాధా కృష్ణ చౌహాన్ ప్రధాన అతిథిగా హాజరై దీపప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హుజూర్‌నగర్ కోర్టులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఘనంగా

ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవా సంస్థల పాత్ర కీలకమని తెలిపారు. సమాజంలో ప్రతి వ్యక్తి న్యాయం పొందే హక్కు గురించి అవగాహన కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తరువాత న్యాయ సేవా దినోత్సవం భాగంగా కోర్టు ప్రాంగణం నుండి హుజూర్‌నగర్ పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఈ ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఎస్‌ఐ, న్యాయవాదులు రాఘవరావు, యాదగిరి, శంకర్, రేణుకా దేవి, జుట్టుకొండ సాంధ్య, దీపికా, హుస్సేన్, పాషా, ఆదవి రాముడు తదితరులు పాల్గొన్నారు. కోర్టు సిబ్బంది కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments