డైనమిక్,మాచర్ల, అక్టోబర్ 26
ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు ఇంటి కోడలు కాబోతున్న పల్నాడు వాసి లేళ్ల శిరీష వివాహ వేడు కలు ఆదివారం ప్రారంభమయ్యాయి.శిరీష,సినీ నటుడు నారా రోహిత్ ల వివాహం ఈ నెల 30 న హైదరాబాద్ లో జరగనుంది. శిరీష తల్లితండ్రుల స్వస్తలం గురజాల మండలం దైద గ్రామం. ఐతే శిరీష తల్లితండ్రులు లేళ్ల నాగేశ్వరరావు ,వెంకటరమణలు చాలా ఏళ్ల క్రితం రెంటచింతల లో స్తిర పడ్డారు. ఆదివారం శిరీష ను రెంటచింతల లో పెళ్లికూతురు ని చేసి వివాహ వేడుకలు జరిపారు. ఈ ఉత్సవానికి పల్నాడు ప్రాంతంలో ఉన్న లేళ్ల కుటుంబం బంధుమిత్రులు హాజరు అయి శిరీషను ఆశీర్వదించారు.
