Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనల్గొండలో మత్తు టాబ్లెట్స్ రాకెట్ బస్టు17 మందిపై ఎన్‌డీపీ‌ఎస్ కేసు నమోదు – 7 మంది...

నల్గొండలో మత్తు టాబ్లెట్స్ రాకెట్ బస్టు17 మందిపై ఎన్‌డీపీ‌ఎస్ కేసు నమోదు – 7 మంది అరెస్ట్

నల్లగొండ బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 21

నల్గొండ పట్టణంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం కేసులో పోలీసులు భారీగా బట్టబయలు చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సంయుక్తంగా చేసిన దాడుల్లో 17 మందిపై కేసులు నమోదు కాగా, వారిలో 7 మందిని అరెస్టు చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు ఎలాంటి డాక్టర్ సూచన లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్స్ అమ్ముతున్న ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడిని అరెస్టు చేసి, షాప్‌ను మూసివేశారని చెప్పారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆ మెడికల్ షాప్‌ను సీజ్ చేశారు.ఈ దాడుల్లో సుమారు 30 వేల రూపాయల విలువ గల 2400 స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ టాబ్లెట్స్, 345 ట్రామడాల్ టాబ్లెట్స్, రెండు సెల్‌ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల దాడి వివరాలు

తేదీ 20 అక్టోబర్ మధ్యాహ్నం మునుగోడ్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి బైక్‌పై పారిపోగా వెంటపడి పట్టుకున్నారు. విచారణలో అతను నల్గొండకు చెందిన మహమ్మద్ జబీఉల్లా అని తేలింది. అతను ఫ్రీజ్ మెకానిక్‌గా పనిచేస్తూ గత ఐదు సంవత్సరాలుగా మత్తు టాబ్లెట్స్‌కి బానిసై, వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ రేటుకు యువతకు అమ్ముతూ లాభాలు పొందుతున్నట్లు ఒప్పుకున్నాడు.ఆ వ్యక్తి సమాచారం ఆధారంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వెంకటరమణ మెడికల్ షాప్ నిర్వాహకుడు దారం కృష్ణ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన డాక్టర్ సూచన లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్స్‌ను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆ షాప్‌లో లభించిన టాబ్లెట్స్, రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకొని షాప్‌ను సీజ్ చేశారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

మహమ్మద్ జబీఉల్లా వద్ద నుండి 1152 స్పాస్మో టాబ్లెట్స్, బర్గ్‌మన్ బైక్, మొబైల్ ఫోన్ దారం కృష్ణ సాయి వద్ద నుండి 1296 స్పాస్మో టాబ్లెట్స్, 345 ట్రామడాల్ టాబ్లెట్స్, మొబైల్ ఫోన్

డ్రగ్స్‌పై కఠిన చర్యలు

డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు कि ఇకపై మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కేవలం కౌన్సెలింగ్ కాకుండా కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని అన్నారు.ఈ ఆపరేషన్‌లో ఎన్డీపీ‌ఎస్ చట్టం 22(సి), 27(ఎ), 29 ప్రకారం కేసు నమోదు చేయబడింది. దాడుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్‌పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments