Monday, March 2, 2026
Homeతాజా సమాచారంనల్గొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన

నల్గొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన

నల్గొండ బ్యూరో, అక్టోబర్ 28, డైనమిక్

మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆమె కట్టంగూరు మండలంలోని ఐటిపాముల, కట్టంగూరు, రెడ్డి కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ —

“వర్షపు నీరు ధాన్యం కుప్పల వైపు రాకుండా కాలువలు తీసి నీటిని మళ్లించాలి. ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలి” అని సూచించారు.రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తేమశాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, తాలు, తరుగు వంటి లోపాలు లేని ధాన్యాన్ని ప్రాధాన్యంగా కొనుగోలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.అలాగే ఎక్కడైనా హమాలీల కొరత ఉంటే వెంటనే తగినంత మందిని ఏర్పాటు చేయాలని, లారీలు లేదా మిల్లర్ల సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షాలు కొనసాగుతున్నందున రైతులు వర్షాలు తగ్గేవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్‌, డీఆర్‌డీవో శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యా నయ్స్క్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్‌, జిల్లా మేనేజర్‌ గోపీకృష్ణ‌, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments