Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంనూతన కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని ఎంఆర్ఎస్ సంఘం డిమాండ్

నూతన కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని ఎంఆర్ఎస్ సంఘం డిమాండ్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 25

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక కోడ్‌లను రద్దుచేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ మెడికల్ రిప్రెజెంటేటివ్ సంఘం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ కార్యక్రమం మంగళవారం నల్లగొండలో జరిగింది.

కొత్త కోడ్‌ల వల్ల జీవితం అగమ్యగోచరం” — పాల్వాయి హరిప్రసాద్

మెడికల్ రిప్రెజెంటేటివ్‌లకు కొత్త కార్మిక కోడ్‌లు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని జిల్లా సంఘం అధ్యక్షుడు పాల్వాయి హరిప్రసాద్ అన్నారు.
పాత చట్టాలు కార్మికులకు రక్షణగా నిలిచేవని, వాటిని తిరిగి అమల్లోకి తేవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

కలెక్టర్‌కి మెమొరాండం సమర్పణ

కొత్త కార్మిక కోడ్‌ల రద్దు, పాత చట్టాల పునరుద్ధరణ వంటి కీలక డిమాండ్‌లను ఉంచుతూ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చింది. కోడ్‌ల అమలు వల్ల మెడికల్ రిప్రెజెంటేటివ్‌ల జీవితం, వేతనాలు, సేవా నియమాలు తీవ్ర ప్రభావం పొందుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రముఖ నాయకులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమ స్వామి, కోశాధికారి అనుదీప్, ఉపకార్యదర్శి తాజుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట సుధాకర్, జాయింట్ కన్వీనర్లు రమేష్, శ్రీనివాస్, మనోజ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments