గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్…
డైనమిక్,గుంటూరు
మాయాబజార్ ప్రాంతంలో ట్రాపిక్ సమస్యకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ లెజిస్లేటివ్, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. నియోజకవర్గంలో గురువారం డిప్యూటీ మేయర్ సజీల, సర్కిల్ ఇన్ స్పెక్డర్ అశోక్ తో కలిసి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మాయాబజార్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మాయాబజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో వ్యాపారులు, కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. అయితే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక అక్రమణలు తొలగించాలని ఈ సందర్భంగా వ్యాపారులను నసీర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చీష్టి, సయ్యద్ అన్వర్, ఎస్ఎస్పీ జాదా, హిదాయతుల్లా, జునేత్, సుభాని, ఫహీముల్లా, ఖాసిం షరీఫ్, కలీం, గఫారి, రసూల్, ఖాజా మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
