సిడ్నీ, అక్టోబర్ 19 ,డైనమిక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించారు. సిడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఐదు రోజులపాటు ఆస్ట్రేలియాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న లోకేష్, అక్కడి వీసీలు, వ్యాపార వేత్తలు, స్టార్టప్ ప్రతినిధులతో భేటీ కానున్నారు.పర్యటన మొదటి రోజు సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, ప్రవాస భారతీయులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోకేష్ వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
