డైనమిక్ న్యూస్,నాగార్జున యూనివర్సిటీ , జనవరి 6
నాగార్జున యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధ, గురువారాలలో “ఆచార్య నాగార్జునడి ఆల్కెమికల్ వారసత్వం – సాంప్రదాయిక మరియు ఆధునిక దృక్పథాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు.
ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్
బుధవారం జరిగే సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ మంత్రి నారా లోకేష్‌ను కలిసి సదస్సుకు ఆహ్వానించారు.
విశిష్ట అతిథులుగా ప్రముఖులు
సదస్సుకు విశిష్ట అతిథులుగా పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్,
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధు మూర్తి,యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మంత శ్రీనివాసు
పాల్గొంటారని తెలిపారు.
ముఖ్య అతిథుల హాజరు
వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. గంగాధర్ రావు,రెక్టార్ ప్రొఫెసర్ ఆర్. శివరాం ప్రసాద్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం హాజరుకానున్నారు.
కీలక ఉపన్యాసం
మంగళాయతన్ విశ్వవిద్యాలయం, జబల్పూర్ ఉపకులపతి ఆచార్య కేఆర్ ఎస్ సాంబశివరావు సదస్సులో కీలక ఉపన్యాసాన్ని అందించనున్నారు.
ప్రత్యేక ఆహ్వానితులు
ప్రత్యేక ఆహ్వానితులుగాసైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కే. వీరయ్య,ఓఎస్‌డీ ఆచార్య ఆర్.వి.ఎస్.ఎస్.ఎన్. రవికుమార్
పాల్గొంటారు.
సదస్సు నిర్వహణ బాధ్యతలు
జాతీయ సదస్సుకో కన్వీనర్‌గా ప్రొఫెసర్ పి. సుధాకర్,ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.హెచ్. మల్లికార్జునరావు,ట్రెజరర్‌గా డాక్టర్ పి. భరత్
వ్యవహరిస్తున్నారు.
140 పరిశోధన పత్రాలు, 300 మంది ప్రతినిధులు
ఈ జాతీయ సదస్సుకు ఇప్పటివరకు 140 పరిశోధన పత్రాలు సమర్పించబడ్డాయని, తమిళనాడు, కేరళ, తెలంగాణ, న్యూఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు.
