ఏపీ డైనమిక్ డెస్క్,తుని, అక్టోబర్ 22
తునిలో గురుకుల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ
“గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారయత్నం జరగడం షాక్‌కు గురిచేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇలాంటి నీచకృత్యాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం” అని హెచ్చరించారు.అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.
