అంతర్జాతీయ అవకాశాల కోసం ఏపీ యువతకు నూతన మార్గం
అమరావతి , డైనమిక్,అక్టోబర్18
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు శనివారం బయలుదేరారు. ఏడు రోజుల స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పర్యటన జరుగనుంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు—
“ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది. వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల సీఈవోలు, మంత్రులతో సమావేశమై సహకార అవకాశాలను పరిశీలిస్తాం” అని అన్నారు.అలాగే చేపల ఎగుమతులకు కొత్త మార్కెట్లు సృష్టించడానికి ఆస్ట్రేలియా సీఫుడ్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. “రాష్ట్రంలోని మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ల ద్వారాలు తెరవడం మా లక్ష్యం” అని లోకేష్ స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్బెరా నగరాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు.
