Saturday, February 7, 2026
Homeతాజా సమాచారంనేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి విస్తృత పర్యటన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి విస్తృత పర్యటన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నల్లగొండ బ్యూరో, జనవరి 17, డైనమిక్ న్యూస్

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(నేడు )శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

24 గంటల తాగునీటి పథకానికి శ్రీకారం

ఉదయం 10 గంటలకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు V.T కాలనీ టెంపుల్ వద్ద రూ. 2 కోట్ల వ్యయంతో 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా అందించే పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

పార్కుల అభివృద్ధి, బీటీ రోడ్డు విస్తరణ

ఉదయం 10.30 గంటలకు చింతల్, రామ్‌నగర్, రాజీవ్ పార్క్, మామిళ్లగూడెం పార్కుల అభివృద్ధి కోసం N.G కాలనీలో రూ.2.25 కోట్లతో చేపట్టే పనులను ప్రారంభిస్తారు.అదే సమయంలో N.G కాలేజీ నుంచి రామగిరి వరకు రూ. 1.50 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు.

దేవరకొండ రోడ్డులో సీసీ–బీటీ రోడ్ల నిర్మాణం

ఉదయం 11.15 గంటలకు నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో గల GM కన్వెన్షన్ హాల్ నుంచి అక్కలైగూడెం వరకు (23వ వార్డులు) రూ. 7.50 కోట్ల వ్యయంతో చేపట్టే నూతన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

స్టార్మ్ వాటర్ డ్రైన్లు, సీసీ రోడ్లు

ఉదయం 11.45 గంటలకు 40వ వార్డు సావర్కర్ నగర్, రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో (18వ వార్డుల పరిధిలో) రూ. 3.50 కోట్లతో చేపట్టే స్టార్మ్ వాటర్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహిస్తారు.

గ్రేవ్‌యార్డ్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు

మధ్యాహ్నం 12.30 గంటలకు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్న గ్రేవ్‌యార్డ్ అభివృద్ధి కోసం రూ. 1.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను మంత్రి ప్రారంభిస్తారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ పనులు ప్రారంభం

మధ్యాహ్నం 1 గంటకు చందన్‌పల్లి వద్ద రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు.

స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

ఈ కార్యక్రమాల అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments