Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంమాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన  మండల కాంగ్రెస్...

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన  మండల కాంగ్రెస్ నేతలు

పాలకవిడు, డైనమిక్, అక్టోబర్ 31

పాలకవీడు మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్‌.వి. సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్య గోపాల్, మార్కెట్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి నరసింహారావులు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మహిళా శక్తికి మార్గదర్శి – నాయకులు

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇందిరా గాంధీ మహిళా శక్తికి ప్రతీకగా, ధైర్యసాహసాల ప్రతిరూపంగా నిలిచారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు.దేశ సమైక్యత, అభివృద్ధి, ప్రజాస్వామ్య బలపాటుకు ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ఆమె కుటుంబం చేసిన త్యాగాలు భారత చరిత్రలో నిలిచిపోతాయని వారు గుర్తుచేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శులు ధీమా నాయక్, సుబ్బు గౌడ్, యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెచ్చాల శ్రీకాంత్, రమేష్, బీసీ సెల్ నాగయ్య, ఎస్టీ సెల్ నాగరాజు, వాణిజ్య సెల్ వెచ్చా సందీప్, రాము నాయక్, గిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments