Saturday, February 7, 2026
Homeతాజా సమాచారంకర్ల రాజేష్ సంతాప సభలో మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం...

కర్ల రాజేష్ సంతాప సభలో మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలి – బాధ్యుడైన ఎస్సైను వెంటనే విధుల నుంచి తొలగించాలి

మోతే మండలం, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 3


మోతే మండలం మోతే గ్రామంలో కర్ల రాజేష్ సంతాప సభకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ల రాజేష్ మృతికి కారణమైన ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయడంతో పాటు, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

రాజేష్ మరణంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దళిత బిడ్డల సమస్యల కోసం అవసరమైతే ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు.


నాయకుల స్పందనపై విమర్శలు

ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ, బొల్లం మల్లయ్యను ఇరికించడానికే రాజేష్ లాక్‌అప్‌లో మృతి చెందాడని వ్యాఖ్యానించినప్పటికీ, ఇప్పటివరకు రాజేష్ కుటుంబాన్ని పరామర్శించలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు.అలాగే, సీపీఐ పార్టీకి చెందిన జాన్ వెస్లీకి ఫోన్ ద్వారా విషయం తెలియజేసినా స్పందన లేదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్వగ్రామం కోదాడ అయినా, రాజేష్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమన్నారు.


విస్తృతంగా పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మోతే మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య శంకర్ నాయక్, సీపీఐఎం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బైరుపంగు విజయ్, మోతే సర్పంచ్ దోసపాటి అనురాధ, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments