Tuesday, January 13, 2026
Homeతాజా సమాచారంరాజ్యాంగం పౌరులకు మహావరం : జిల్లా ఎస్పీ నరసింహ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ...

రాజ్యాంగం పౌరులకు మహావరం : జిల్లా ఎస్పీ నరసింహ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసిన జిల్లా పోలీస్ సిబ్బంది

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 26

రాజ్యాంగం అనేది భారత పౌరులకు లభించిన మహత్తర వరమని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను ఘనంగా పఠించారు.

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రాజ్యాంగ విలువలను కాపాడుతూ, చట్ట పాలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు.

మహానుభావుల త్యాగాల ఫలితం

రాజ్యాంగం ఏర్పాటుకు అనేక మంది మహానుభావులు చేసిన త్యాగాలను ఎస్పీ గుర్తు చేశారు. వారి కృషి ఫలితంగా నేడు మనం స్వేచ్ఛగా జీవించే అవకాశం పొందామని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చట్టానికి లోబడి నడుచుకోవాలి

ప్రతి పౌరుడు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి జీవించినప్పుడే సమాజంలో శాంతి, భద్రత, సౌభ్రాతృత్వం నిలుస్తాయని ఎస్పీ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా ఆచరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments