డైనమిక్ న్యూస్ మార్చ్ 24 టేక్మాల్
ఈ నెల 28న రాజీకి మంచి మార్గం
టేక్మాల్ మండలంలో రాజీ పడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ సూచించారు. మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అని పేర్కొన్నారు కక్షిదారులు అర్జీదారులు ఇరువురు పరస్పర అంగీకారంతో రాజీ పడితే అప్పటికప్పుడే కేసులను తొలగించుకోవచ్చని తెలిపారు.తక్కువ జరిమానాతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఈ-పెట్టి కేసులను అతి తక్కువ జరిమానాతో ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ నెల 24 నుండి 28 వరకు అల్లాదుర్గం కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
డబ్బు, సమయం ఆదా
దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, మనశ్శాంతి లభిస్తుందని ఎస్సై పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం లేదా ఏవైనా సందేహాలుంటే టేక్మాల్ పోలీస్ స్టేషన్ నంబర్లు 8712657885, 8712657918 కు సంప్రదించాలని ఆయన కోరారు. చట్టపరమైన చిక్కుల నుండి విముక్తి పొందేందుకు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
