నల్లగొండ బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 27
4,906 టెండర్లకు లక్కీ డ్రా
నల్గొండ జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం 4,906 టెండర్లు దాఖలయ్యాయి. ఈ దుకాణాల కేటాయింపుకు సంబంధించి సోమవారం ఉదయం నల్గొండలో లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభమైంది.
లక్ష్మీ గార్డెన్ వేదికగా లక్కీ డ్రా కార్యక్రమం
జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ — “ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించేలా పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగుతోంది” అన్నారు.
ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు
లక్కీ డ్రా సాఫీగా జరిగేందుకు ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో టెండర్ దారులు, వారి మద్దతుదారులు హాజరయ్యారు.
పోలీసుల గట్టి బందోబస్తు
లక్కీ డ్రా వేదిక వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
అధికారుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణం
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, ఎక్సైజ్, పోలీసు అధికారులు లక్కీ డ్రా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.



