డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 9
కమ్మ కుల ఐక్యత, పరస్పర సహకారం, సామాజిక సేవ లక్ష్యంగా నేరేడుచర్ల పట్టణంలో ఘనంగా సమావేశం జరిగింది. “అందరూ బాగుండాలి — అందులో మనం ఉండాలి” అనే నినాదాన్ని పునికి పుచ్చుకుంటూ, కమ్మ కుల ఐక్యతతో సమాజాభివృద్ధి దిశగా కదలాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు.
సేవా భావంతో ముందుకు సాగుదాం
“ఈ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న గీతంలోని ఆత్మను ప్రతిబింబిస్తూ, మన కులాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి పరచి, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ముందుండాలని వక్తలు హితవు పలికారు.
కమ్మ కుల భవనానికి 30 గుంటల స్థల దానం
కమ్మ కుల సంఘానికి స్థిరమైన వేదికగా ఉపయోగపడేలా 30 గుంటల స్థలాన్ని వల్లం చెట్ల కోటేశ్వరరావు దంపతులు భవన నిర్మాణం కోసం దానం చేశారు. ఈ సదుద్దేశానికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
విరాళాలతో అభివృద్ధి పథంలో
భవన నిర్మాణానికి తొలి విరాళంగా రావులపల్లి ప్రసాద్ రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఇతర సభ్యులు కూడా తమ వంతు సహకారాన్ని ప్రకటించారు.
ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు
ఉదయం ఉసిరి చెట్టు పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, సమాజ సేవా ప్రతిజ్ఞలతో ఉత్సాహంగా సాగింది.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
సిడి రవికుమార్, మువ్వ అరుణ్‌కుమార్, అమితినేని అమర్, రావులపల్లి ప్రసాద్, వీరమాచనేని రామకృష్ణ, సూరపనేని ప్రసాద్, చలసాని రాజీవ్, చావా సత్యప్రసాద్, వాసిరెడ్డి సతీష్, యారవ సురేష్, నాగండ్ల శ్రీధర్, సుంకర క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.కమిటీ సభ్యులలో సుంకర ప్రదీప్తి, నిమ్మగడ్డ సుబ్బారావు–అన్నపూర్ణ, చెరుకూరు తిరుపతమ్మ, దివ్య, పోలవరపు చిట్టిబాబు, చెరుకూరి రవి, వల్లభనేని మాధవరావు ఉన్నారు.
