డైనమిక్ న్యూస్,గుంటూరు, నవంబర్ 23
సంవిధాన దివాస్ సందర్భంగా ‘కానిస్టిట్యూషన్ వీక్ సెలబ్రేషన్స్–2025’లో భాగంగా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా మరియు గుంటూరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు.
చట్టాలపై అవగాహన ప్రతి పౌరునికీ అవసరం:
జడ్జి సాయి కళ్యాణ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్–కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ—విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటేనే దేశానికి ‘‘పిల్లర్స్ ఆఫ్ నేషన్’’గా ఎదగగలరని చెప్పారు.చట్టాలు తెలుసుకోవడం ద్వారా హక్కులు–బాధ్యతలు స్పష్టమవుతాయని,న్యాయ సేవలను అందరికీ చేరేలా లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తోందని,విద్యార్థులు కష్టపడి చదవాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ లీగల్ ప్రొఫెషన్‌లో అత్యంత కీలకమని,ప్రజలకు సేవ చేయాలనే మనసున్న వారే నిజమైన న్యాయవాదులవుతారని,జడ్జి సాయి కళ్యాణ్ హితవు పలికారు.ఉచిత న్యాయ సహాయం, రక్షణ పథకాలపై విద్యార్థులకు అవగాహనమరో ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ–కమ్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) సయ్యద్ జియౌద్దీన్ మాట్లాడుతూ—ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఏయిడ్ క్లినిక్స్, మహిళలు–పిల్లల రక్షణ పథకాలపై సమగ్ర వివరాలు ఇచ్చారు.సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ పాత్రను వివరించారు.
డ్రగ్ దుర్వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది.గుంటూరు ఫస్ట్ అడిషినల్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) వై. గోపాలకృష్ణ మాట్లాడుతూ—
ప్రస్తుతం యువతలో పెరుగుతున్న డ్రగ్ అబ్యూస్ పై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు యువతను డిప్రెషన్‌కు గురిచేస్తాయని,ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని,చిన్న తప్పిదం కూడా జీవితాన్ని నాశనం చేస్తుందని,డిజిటల్ అబ్యూస్ ప్రమాదాలపై కూడా హెచ్చరించారు,యువత ఈ దారిని అసలు పట్టకూడదని పిలుపునిచ్చారు.
అసంఘటిత రంగ కార్మికులకు పథకాలపై అవగాహన
గుంటూరు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రి—అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు, అందుబాటులో ఉన్న పథకాలపై వివరించారు. అనంతరం మహిళా కార్మికులకు ఈ–శ్రమ్ కార్డులు, పురుషులకు హెల్మెట్లు అందజేశారు.
విజేతలకు బహుమతులు – ముఖ్య అతిథులకు ఘన సన్మానం
విజ్ఞాన్ లా కాలేజీ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో కాలేజీ డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
