Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కారంపూడి వీరోత్సవాల్లో నేతల వ్యాఖ్యలుపల్నాడు – అన్యాయంపై పోరాట సంస్కృతి ప్రతీక

కారంపూడి వీరోత్సవాల్లో నేతల వ్యాఖ్యలుపల్నాడు – అన్యాయంపై పోరాట సంస్కృతి ప్రతీక

డైనమిక్ న్యూస్,కారంపూడి, నవంబర్ 22

పల్నాడు అన్యాయానికి ఎదురు నిలిచిన చారిత్రక నేల అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కారంపూడి వీరుల మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన కోడిపోరు ఉత్సవంలో పాల్గొని, అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం మీడియాతో మాట్లాడారు.

అన్యాయంపై పోరాటమే పల్నాటి యుద్ధం – ఎంపీ లావు

11వ శతాబ్దంలోనే అన్యాయాలపై తిరుగుబాటు చేసి యుద్ధానికి దారి తీసిన ఘనత పల్నాడుదేనని ఎంపీ లావు గుర్తుచేశారు. వైసీపీ పాలనలో జిల్లాలో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేడు అభివృద్ధి దిశగా మారిందని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు అందిన వెంటనే వరికిపూడిశెల పనులు ప్రారంభమవుతాయని, అన్ని అనుమతులు త్వరలోనే లభిస్తాయని తెలిపారు. జల్ మిషన్ నిధులతో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వాటర్ గ్రిడ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రహదారుల అనుసంధానం, కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా పల్నాడు శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

అసాంఘిక శక్తులే అభివృద్ధికి అవరోధాలు – టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్

పల్నాడు జిల్లాలో అభివృద్ధి పనులకు యవనిక లాగుతున్నది వైసీపీ అసాంఘిక శక్తులేనని టిడిపి జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. గ్రామాల్లో అలజడులు సృష్టించి ప్రజల్లో భయం రేపే చర్యలను జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే వీరోత్సవాల్ని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డిని అభినందించిన శ్రీధర్, రాయలసీమలో ఫ్యాక్షన్‌ను చంద్రబాబు అదుపులో పెట్టినట్లే, మాచర్లలో బ్రహ్మరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను సమసిపోవడానికి కూటమి శ్రమిస్తోందని చెప్పారు.

ఫ్యాక్షన్ జిల్లా కాదు… సాంస్కృతిక ఖిల్లా – ఎమ్మెల్యే జూలకంటి

పల్నాడు జిల్లా అంటే ఫ్యాక్షన్ అనే చెడ్డపేరుకు అంతముపెట్టి, సాంస్కృతిక జిల్లా అనే గుర్తింపుని కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకువస్తుందని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు. ప్రాచీన పల్నాడు వైభవ పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. జల్ జీవన్ మిషన్, వరికిపూడిశెల అనుమతులు, సాగర్ పర్యాటక అభివృద్ధి, అమృత స్కీమ్ నిధుల పొందడంలో కృషి చేసిన ఎంపీ లావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments