నేరేడుచర్ల, డైనమిక్ ,నవంబర్ 2
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), హైదరాబాద్ ఆధ్వర్యంలో టెన్త్ మరియు ఇంటర్ కోర్సుల్లో చేరికలకు చివరి అవకాశం ఈనెల 7వ తేదీ వరకు మాత్రమే ఉందని ఆదివారం పీ ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రధానోపాధ్యాయులు బట్టు మధు తెలిపారు.ఇప్పటికే టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు తరగతులను ప్రారంభించి, ప్రభుత్వం పంపిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. చదువును మధ్యలో ఆపిన విద్యార్థులు, వయోజనులు ఈ ఓపెన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసి తదుపరి చదువులు కొనసాగించడం తోపాటు ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పరీక్షల్లో సత్తా చాటవచ్చని సూచించారు.ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు కూడా అర్హత గల చదువులు పూర్తి చేసుకుని ప్రమోషన్లు పొందే అవకాశం ఉందని బట్టు మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రషీద్ ఖాన్, కట్ట వెంకటేశ్వరరావు, కురివెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
