Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంహుజూర్నగర్ మెగా జాబ్ మేళా లో 3041 మందికి ఉద్యోగ అవకాశాలు రెండవ రోజు జాబ్...

హుజూర్నగర్ మెగా జాబ్ మేళా లో 3041 మందికి ఉద్యోగ అవకాశాలు రెండవ రోజు జాబ్ మేళా వాయిదా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 25

హుజూర్నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం రిజిస్ట్రేషన్లు మరియు ఇంటర్వ్యూలకు మెగా జాబ్ మేళాకు ఆన్లైన్ ద్వారా 40,000 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు, అందులో 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 3,041 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు, అదనంగా 1,533 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారుచేయబడింది.

విభాగాల వారీగా ఎంపిక వివరాలు

టీ, ఎడ్యు టెక్నాలజీ & స్కిల్స్ ట్రైనింగ్ 5,547 మంది ఇంటర్వ్యూలకు హాజరు, 827 మంది ఎంపిక, 370 మంది షార్ట్ లిస్ట్,ర్వీస్ & మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్: 3,850 మంది హాజరు, 391 మంది ఎంపిక, 804 మంది షార్ట్ లిస్ట్,మ్యాన్యుఫ్యాక్చరింగ్ & టెక్నికల్: 4,520 మంది హాజరు, 610 మంది ఎంపిక,బ్యాంకింగ్, ఫైనాన్స్ & ఇన్సూరెన్స్: 2,440 మంది హాజరు, 713 మంది ఎంపిక,ఫార్మా, హెల్త్ కేర్ & హాస్పిటాలిటీ: 2,167 మంది హాజరు, 210 మంది ఎంపిక, 195 మంది షార్ట్ లిస్ట్ ,ఆటోమొబైల్స్: 952 మంది హాజరు, 102 మంది ఎంపిక, 154 మంది షార్ట్ లిస్ట్ ,లాజిస్టిక్స్ & ఎయిర్ పోర్ట్: 1,047 మంది హాజరు, 188 మంది ఎంపిక, 10 మంది షార్ట్ లిస్ట్

రెండవ రోజు జాబ్ మేళా వాయిదా

జాబ్ మేళాను రెండు రోజులు నిర్వహించడానికి నిర్ణయించినప్పటికీ, కొన్ని కంపెనీలు ఇతర ప్రదేశాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడంతో ఆదివారం జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కొత్త తేదీ తర్వాత ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు

జాబ్ మేళా విజయవంతం కావడంలో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సహకరించారని మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు

మారుమూల ప్రాంత యువతలు ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. హుజూర్నగర్‌లో 259 కంపెనీలతో జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడినట్లు చెప్పారు. మొత్తం 4,574 మంది (3,041 ఎంపిక + 1,533 షార్ట్ లిస్ట్) ప్రయోజనం పొందినందుకు మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.జాబ్ మేళా సందర్భంగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామరావు, చింతల లక్ష్మీనారాయణ రెడ్డి, తన్నీర్ మల్లిఖార్జున్, దొంగరి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments