గ్రామపాలన అధికారులు, పంచాయతీ సెక్రటరీలకు సూచనలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 24
హుజూర్నగర్ టౌన్ హాల్‌లో రేపు, ఎల్లుండి జరగనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం గ్రామపాలన అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ మేళాకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నోడల్ అధికారులుగా నియమించబడిన అధికారులు తమకు కేటాయించిన రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ స్టాల్స్ వద్ద అభ్యర్థులకు అవసరమైన అప్లికేషన్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అభ్యర్థుల వివరాలు నమోదు చేయాలి
ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి పేరు, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా నమోదు చేయాలని, వారి అర్హతను బట్టి ఆయా కంపెనీల స్టాల్స్‌కి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థుల అర్హతను పరిశీలించి ఉద్యోగాలను కేటాయిస్తారని, ఎంపికైన వారు, ఎంపిక కానివారి వివరాలను సైతం రికార్డులో ఉంచాలని ఆయన అన్నారు.


జాబ్ మేళా విజయవంతం చేయాలి
జాబ్ మేళాలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కలెక్టర్ పవార్ పేర్కొన్నారు. ఇందుకోసం అందరూ క్రమశిక్షణతో, సమన్వయంతో పని చేసి మేళాను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డి.ఇ.ఇ.టి. అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
