Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంకోదాడ లాకప్‌ డెత్‌పై జేఏసీ రాస్తారోకోనల్ల కండువాలతో మోకాళ్లపై వినూత్న నిరసన

కోదాడ లాకప్‌ డెత్‌పై జేఏసీ రాస్తారోకోనల్ల కండువాలతో మోకాళ్లపై వినూత్న నిరసన

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 19

కోదాడ లాకప్ డెత్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ప్రధాన కూడలిలో మోకాళ్లపై రాస్తారోకో నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి చిలుకూరు ఎస్సై, కోదాడ సీఐల అత్యుత్సాహం వల్ల కర్ల రాజేష్ మృతి చెందాడని నేతలు ఆరోపించారు.

అనుమానితుడిగా అరెస్టు… వారం రోజుల హింస తర్వాత మృతి : నేతల ఆరోపణ

జేఏసీ నాయకులు మాట్లాడుతూ — ఎలాంటి స్పష్టమైన నేరం లేకుండా కేవలం అనుమానితుడి గా రాజేష్‌ను అరెస్టు చేసి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోయినా రిమాండ్‌కు తరలించడంతో పరిస్థితి విషమించి సూర్యాపేట, అనంతరం హైదరాబాద్ తరలించే సమయంలో రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని వివరించారు.ఈ ఘటనకు చిలుకూరు ఎస్సై, కోదాడ సీఐలు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందని, వారిని విధుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలి

అనుకోని పరిణామంతో యువకుడు రాజేష్ మృతి చెందడం దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేతలు కోరారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని జేఏసీ పేర్కొంది.

రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింది

రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జేఏసీ నాయకులు విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంత కాలం అయినా హోం మంత్రి నియామకం జరగకపోవడం పాలకుల వైఫల్యమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరసనలో పాల్గొన్న నేతలు

ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ రాయుడు, జేఏసీ నాయకులు రాపోలు నవీన్ కుమార్, చిలకరాజు శ్రీను, యడవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్‌ నాయకులు యడవల్లి చంద్రయ్య, తాడిమల్ల నరసింహ, తక్కెళ్ళ నాగార్జున, నన్నెపంగ నరేష్, బొల్లం అశోక్, చిలక బాబు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments