డైనమిక్ న్యూస్ మఠంపల్లి, మార్చి 26
సమాచార హక్కు రక్షణ చట్టం-2005 రాష్ట్ర ఐదవ మహాసభలు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఆర్టీఐ చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు తమ హక్కులను తెలుసుకునే శక్తినిచ్చిందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. గత 21 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చేయడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించిందన్నారు.
అవినీతి వెలికితీతలో కీలక పాత్ర
ప్రధాన కార్యదర్శి చందమల్ల సుధాకర్ మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా బయటపెట్టినట్లు తెలిపారు. అయితే ఇటీవల ఈ చట్టం నిర్వీర్యం అవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.
కమిషన్ వేగవంతమైన చర్యలు అవసరం
రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార కమిషన్‌లో పెండింగ్ అప్పీల్స్‌ను వేగంగా పరిష్కరించాలని సూచించారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి జిల్లాలో ఆర్టీఐ అమలు కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల భద్రతపై ఆందోళన
రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్టీఐ దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం కావడం వల్ల కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. వారి రక్షణకు సంబంధించిన ప్రభుత్వ మెమోలను కఠినంగా అమలు చేయాలని కోరారు.
ప్రజలకు వారధిగా ఆర్టీఐ సొసైటీ
సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా చేరేలా తమ సొసైటీ కృషి చేస్తోందని తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు
కరుణాకర్, ఆర్గనైజర్ విద్యాసాగర్, వరంగల్
ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అమీర్,
సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నవీన్, పెద్దపల్లి
జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, ఖమ్మం
జిల్లా అధ్యక్షులు సురేష్, మహబూబాబాద్
జిల్లా అధ్యక్షులు రమేష్, నల్గొండ జిల్లా
వర్కింగ్ ప్రెసిడెంట్ మధు బాబు, వరంగల్
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్, రాహుల్,
నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు
బాలరాజు, సూర్యాపేట జిల్లా కమిటీ
సభ్యులు, బత్తిని నాగేశ్వరరావు, కృష్ణంరాజు,
ఉదయ్ కుమార్, అంజి, పవన్, వీరబాబు,
ధనముర్తి రామారావు, శ్రీను, కడప పెంటయ్య,
నందిపాటి గురవయ్య, నాగార్జున, సోమేశ్వర్,
తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి సహ
చట్టం కార్యకర్తలు, సూర్యపేట జిల్లా ప్రజలు
పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
