డైనమిక్,తిరుపతి జిల్లా, అక్టోబర్ 29
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. రాబోయే నవంబర్ 2న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్‌ప్యాడ్ నుంచి ‘ఎల్‌వీఎమ్-3 ఎం5’ (LVM3-M5) బాహుబలి రాకెట్ ద్వారా సీఎంఎస్ 03 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని సాంకేతిక సన్నాహాలు పూర్తి చేశారు. సుమారు 4,400 కిలోల బరువున్న జీఎస్ఏటీ–7ఆర్ (GSAT–7R) ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జీటియో ఆర్బిట్ (GTO Orbit) లోకి ప్రవేశపెట్టనున్నారు.ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.దేశ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఈ ప్రయోగంపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది.
