సూర్యాపేట బ్యూరో, నవంబర్ 10, డైనమిక్
ముస్లిం మత పెద్దలు, ప్రజలందరినీ “జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్” 137వ జయంతి వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమం
ఈ వేడుకను మంగళవారం (11.11.2025) ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించనున్నారని వెల్లడించారు.
ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి
అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన సేవలు, దేశభక్తిని స్మరించుకునే ఈ వేడుకలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి పిలుపునిచ్చారు.
