Thursday, January 15, 2026
Homeజాతీయంఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మొత్తం 258 పోస్టులు – నవంబర్ 16వ తేదీ...

ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మొత్తం 258 పోస్టులు – నవంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

న్యూఢిల్లీ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28

కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) తాజాగా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 258

విభాగాల వారీగా
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 90 పోస్టులుఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 168 పోస్టులు

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ఇ./బి.టెక్ లో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఐటి / కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులు అయి ఉండాలిలేదాసైన్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఫిజిక్స్ వంటి విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.అదనంగా అభ్యర్థులు తప్పనిసరిగా GATE 2023, 2024 లేదా 2025 లోఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (EC) లేదాకంప్యూటర్ సైన్స్ (CS) కోడ్‌లో కట్ ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25
చివరి తేదీ: నవంబర్ 16
అప్లికేషన్ ఫీజు:
UR, EWS, OBC అభ్యర్థులకు ₹200
ఇతర వర్గాలకు ₹100

ఎంపిక విధానం

GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
స్కిల్ టెస్ట్ – ఉద్యోగానికి సంబంధించిన ప్రాక్టికల్, టెక్నికల్ పరీక్ష ఇంటర్వ్యూ – సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఇంటర్వ్యూ ఫైనల్ మెరిట్ లిస్ట్ – గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా విడుదల

అధికారిక వెబ్‌సైట్:

వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం:
👉 www.mha.gov.in

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments